పాతబస్తీలో కానిస్టేబుళ్ల ఓవరాక్షన్... మద్యం మత్తులో వృద్ధ దంపతులపై దాడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాతబస్తీలో కానిస్టేబుళ్ల ఓవరాక్షన్... మద్యం మత్తులో వృద్ధ దంపతులపై దాడి

హైదరాబాదులోని పాతబస్తీలో రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఓవరాక్షన్ చేశారు. ఫుల్లుగా మధ్యం తాగి మత్తులో తూగుతూ తనిఖీల పేరిట వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ జంటపై వారు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు కానిస్టేబుళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టేసిన స్థానికులు మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

More Telugu News