రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వాదన బలపడుతోంది. ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా, ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగం విన్న తర్వాత ఈ డౌట్ మరింత బలపడింది. సభలో ప్రసంగించింది రాష్ట్రపతే అయినప్పటికీ, ప్రసంగం ఎలా ఉండాలన్నది నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం చెప్పాలనుకున్నదే రాష్ట్రపతి తన ప్రసంగంలో చదువుతారు.
ఈరోజు రాష్ట్రపతి తన ప్రసంగంలో అనేక అంశాల గురించి మాట్లాడారు. తమ ప్రభుత్వం సాధించింది ఏమిటి? రానున్న రోజుల్లో ఏం చేయబోతోంది? తదితర అంశాలపై నాన్ స్టాప్ గా మాట్లాడిన ప్రణబ్ దాదా... తన ప్రసంగంలో కొత్త రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల గురించి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం గమనార్హం. ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు... అలాగే, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన సహాయ సహకారాలు వంటి అంశాలేమైనా ఉంటాయేమో అని అందరూ ఎదురు చూశారు. చివరకు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అందరూ ఉసూరుమన్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు