మీడియా ప్రతినిధి కుమారుడి కిడ్నాప్
చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఉదంతాలు ఇరు రాష్ట్రాల్లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మీడియా ప్రతినిధి కుమారుడు కిడ్నాప్ కు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు కుమారుడు శ్రీవాస్తవను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ కిడ్నాప్ కు కారణం కావచ్చని భావిస్తున్నారు. అదృశ్యమైన శ్రీవాస్తవ కోసం రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.