టీడీపీని పక్కదేశం పార్టీగా మార్చుకోండి: కేటీఆర్
హైదరాబాదులో ఉండి ముఖ్యమంత్రిగా ఏపీని పరిపాలించడం పరాయిదేశం నుంచి పాలిస్తున్నట్టు ఉందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. అలాంటప్పుడు టీడీపీ పేరును 'పక్కదేశం పార్టీ'గా మార్చుకోవాలని సూచించారు. హైదరాబాదులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఓ వైపు ఖజానాలో డబ్బులు లేవంటూనే మరోవైపు రూ.15 కోట్లతో చంద్రబాబు తన ఛాంబర్ ను మరమ్మతు చేయించుకుంటున్నారని విమర్శించారు. వరంగల్ పర్యటనకు ముందే తెలంగాణకు రావాల్సిన విద్యుత్, నీటి వాటాలపై బాబు వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.