జీయోమీ ఎంఐ4 కు భారత్ లో భలే గిరాకీ... 2.5 లక్షల హ్యాండ్ సెట్ల కోసం ఆర్డర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీయోమీ ఎంఐ4 కు భారత్ లో భలే గిరాకీ... 2.5 లక్షల హ్యాండ్ సెట్ల కోసం ఆర్డర్లు!

చైనా మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం జీయోమీ, భారత్ లో తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటోంది. తాజాగా ఎంఐ4 పేరిట ఆ సంస్థ విడుదల చేయనున్న కొత్త మొబైల్ ను కొనేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారట. గత నెల 28 నుంచి మొదలైన రిజిస్ట్రేషన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. చైనా యాపిల్ గా పేరుగాంచిన జియోమీ, ఐఫోన్ ను తలదన్నే స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరలకే అందిస్తున్న విషయం తెలిసిందే. తన తాజా మోడల్ ఎంఐ4 ధరను ఆ సంస్థ రూ.19,999గా నిర్ణయించింది.

More Telugu News