అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా, తన నియోజకవర్గంలోకి ఏ నేత అడుగుపెట్టినా సహించబోనని ఆయన వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని, విచారణలో కడిగిన ముత్యంలా బయటకొస్తానని ఆయన పునరుద్ఘాటించారు. నిరాధార ఆరోపణల కారణంగా తనను పదవి నుంచి తప్పించడంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.