ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా వేస్తా: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆంధ్రజ్యోతి దినపత్రికపై పరువు నష్టం దావా వేస్తానని తెలంగాణ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తనపై అసత్యాలతో కూడిన వార్తా కథనాలను ఆంధ్రజ్యోతి పత్రిక రాసిందని ఆరోపించిన ఆయన, పత్రికపై కోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు. తాము స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపడితే ఓర్వలేని ఆంద్రజ్యోతి అసత్య కథనాలను రాస్తోందని ఆయన ఆరోపించారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పర్యటించిన సందర్భంగా ఆయన ఆంధ్రజ్యోతి కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News