ఊపిరాడక ముగ్గురు మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఊపిరాడక ముగ్గురు మృతి

ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. కార్తికేయ కాలనీలో నివసించే ముఖేష్ (30) ఇంట్లో వెచ్చదనం కోసం బోగ్గుల కుంపటి పెట్టారు. పెట్టిన కాసేపటికే ఊపిరాడక ముఖేష్ తో పాటు అతని భార్య మీనా (27), కుమార్తె (2) అపస్మారకస్థితిలోకి చేరుకున్నారు. అతని పొరుగింట్లో ఉండే ఇందర్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జి ఆర్ థోమర్ ముఖేష్ ఇంట్లోంచి వెలువడుతున్న పొగను గమనించి తలుపులు బద్దలు కొట్టారు. అప్పటికీ వారు మరణించినట్టు గుర్తించారు.

More Telugu News