జేడీయూ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితీష్... పార్టీ నుంచి మాంఝీ తొలగింపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జేడీయూ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితీష్... పార్టీ నుంచి మాంఝీ తొలగింపు

బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టేందుకు మాజీ సీఎం నితీష్ కుమార్ కు మార్గం సుగమమయింది. కాసేపటి క్రితం జరిగిన జేడీయూ పార్టీ సమావేశంలో... ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి మాంఝీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి, శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. జేడీయూ శాసనసభాపక్ష నేతగా నితీష్ ను ఎన్నుకోవడమే కాకుండా, జేడీయూ నుంచి మాంఝీని తొలగించేశారు. దీంతో, మాంఝీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోతుండటమే కాకుండా, ఏకంగా పార్టీకి కూడా దూరమయ్యారు.

More Telugu News