పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పోలియో ప్రభావం తెలిసిందే. భారత్ గత కొన్నేళ్లుగా పోలియో నిర్మూలనకు ఎడతెరిపిలేని పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో సత్ఫలితాలనే సాధించిందనుకోవాలి. దేశంలో పోలియో దాదాపుగా కనుమరుగైనట్టేనని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా, పోలియోను తరిమికొట్టేందుకు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో సంయుక్తంగా సమరం సాగించాలని భారత్ నిర్ణయించింది. అందుకోసం ఆ రెండు దేశాలకు సాయం అందిస్తామని పేర్కొంది. ఇటీవలే భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్, ఆఫ్ఘన్ నుంచి బృందాలను ఆహ్వానించింది. ఇక్కడ పోలియో నిర్మూలనకు తాము అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాల్సిందిగా సూచించింది. ఆఫ్ఘన్ బృందం ఫిబ్రవరి 21న రానుంది. పాకిస్థాన్ ఇంకా తన స్పందన తెలియపరచలేదు.
పాక్, ఆఫ్ఘన్ దేశాల్లో పోలియో పీడితులు అధిక సంఖ్యలో ఉన్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలు చెబుతున్నాయి. 2014లో డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదికలో ప్రపంచంలో పోలియో ప్రభావిత దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, పాకిస్థాన్ లను పేర్కొన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు