సాధారణంగా ఎలుక అంటే చిన్నసైజుతో, ఇంట్లోని రంధ్రాల్లో దూరిపోతూ నోటికి అందిన ప్రతిదానిని కొరికేస్తూ విసిగిస్తుంటుంది. ఇప్పుడంటే ఎలుక చిన్నగా, చేతిలో పట్టే సైజులో ఉంది కానీ, ఒకప్పుడు భీకరంగా ఉండేదట. 30 లక్షల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో సంచరించిన ఎలుక వెయ్యి కిలోల బరువుతో గేదె సైజులో ఉండేదట. ఇప్పటి వరకు కనుగొన్న అన్ని ఎలుక జాతి జంతువుల్లోనూ ఇదే పెద్దదట. గతంలో దొరికిన దీని పుర్రె, ఎముకలపై బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ యార్క్, హల్ యార్క్ మెడికల్ స్కూలు శాస్త్రవేత్తలు కంప్యూటర్ సాయంతో జరిపిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది.
గినియా పందులకు కాస్త దగ్గరి పోలికలతో ఉన్న ఈ ఎలుక జాతి జంతువు పేరు 'జొసెఫోఅర్టిగాసియా మోనెసీ'. దీనికి ముందర ఉన్నపళ్లకు పులిదంతాలంత బలం ఉండేదని, అయితే వీటిని ఏనుగు దంతాలను వినియోగించినట్టు వినియోగించుకునేదని వారు వెల్లడించారు. ఇతర జంతువులతో పోరాడేందుకు, ఆహారం తీసుకునేందుకు, నేలను తవ్వేందుకు మాత్రమే ఉపయోగించేదని వారు తెలిపారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు