విశాఖలోని గోపాలపట్నంలో అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన వైభవ్ షాపింగ్ మాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖలోని గోపాలపట్నంలో అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన వైభవ్ షాపింగ్ మాల్

విశాఖ నగరంలోని గోపాలపట్నంలో నేటి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వైభవ్ షాపింగ్ మాల్ ఉన్న బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. శరవేగంగా వ్యాపించిన మంటలు భవనంలోని మొదటి అంతస్తును పూర్తిగా దహించివేశాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సహాయంతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News