కేంద్ర హోంశాఖ కార్యదర్శిపై వేటు

04-02-2015 Wed 21:34 | National
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిపై కేంద్రం వేటు వేసింది. పదవికి అనిల్ గోస్వామి కళంకం తీసుకొచ్చారని పేర్కంటూ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి మాతంగ్ సిన్హ్ అరెస్టును ఆపాలని ఆయన సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చారని సీబీఐ పీఎంవోకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన కేంద్రం ఆరోపణలు నిజమని తేలడంతో, అనిల్ గో స్వామిని ఈ ఉదయం పిలిచి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ అడిగారు. అరగంటసేపు సమావేశమైన సందర్భంగా, రాజ్ నాథ్ సింగ్ పలు అంశాలపై ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. కాగా, పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలకు దీటుగా బీజేపీ ఎదగాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బంగారంలాంటి అవకాశాన్ని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గో స్వామి నాశనం చేశారని బీజేపీ భావిస్తోంది. ఇదే క్రమంలో అతనిపై చర్యలు తీసుకుంటే, అవినీతి, సిఫారసులను తాము సహించమనే సందేశం ఇచ్చినట్టవుతుందని, ఆయనను తొలగించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more