అఖిల్ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత సహనిర్మాత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అఖిల్ సినిమాకు కేసీఆర్ కుమార్తె కవిత సహనిర్మాత?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సినీరంగంలో ప్రవేశించనున్నట్టు తెలుస్తోంది. నాగార్జున తనయుడు అఖిల్ నటించే సినిమా నిర్మాణంలో కవిత కూడా పాలుపంచుకోనుందట. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు యువ హీరో నితిన్ నిర్మాత కాగా, సహ నిర్మాతగా కవిత వ్యవహరించనుందని ఫిలింనగర్ టాక్. కాగా, కొన్ని నెలల క్రితం కేసీఆర్, నాగార్జున మధ్య 'ఎన్ కన్వెన్షన్' భూమి వ్యవహారం కారణంగా వాడీవేడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు నాగ్ తనయుడి చిత్ర నిర్మాణంలో కేసీఆర్ తనయ పాలుపంచుకోనుందన్న వార్తలు సర్వత్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాగా, ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నితిన్ కుటుంబంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలే కవితను సినీ రంగంవైపు అడుగులు వేయిస్తున్నట్టు అర్థమవుతోంది.

More Telugu News