ఖాకీ కర్కశత్వానికి బలైపోయిన చిన్నారి... వెట్టిచాకిరీ చేయించుకున్న మెదక్ జిల్లా కానిస్టేబుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఖాకీ కర్కశత్వానికి బలైపోయిన చిన్నారి... వెట్టిచాకిరీ చేయించుకున్న మెదక్ జిల్లా కానిస్టేబుల్

కంచె చేను మేసింది. సమాజానికి రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యతను మరచిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చిన్నారి బాలిక పట్ల యముడిగా మారాడు. తల్లిదండ్రులతో కలసి జాతరకు వెళ్లి, తప్పిపోయిన బాలికను ఇంటికి తెచ్చుకున్న ఓ కానిస్టేబుల్ వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. అంతేగాక, తిండి పెట్టకుండా, నిద్ర లేకుండా చేయడమే కాక నిత్యం కొడుతూ బాలికకు నరకం చూపించాడు. కానిస్టేబుల్ కుటుంబం సాగించిన హింసాకాండలో తల, మెదడుకు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సదరు బాలిక కొద్దిసేపటి క్రితం కన్నుమూసింది. తమ బిడ్డకు సంబంధించిన వార్తాకథనాల్లోని ఫొటోను చూసిన తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకునేలోగానే బాలిక కన్నుమూసింది. చనిపోయిన సదరు బాలికను నౌసిన్ బేగంగా పోలీసులు నిర్ధారించారు. బాలికతో వెట్టిచాకిరీ చేయించుకున్న కానిస్టేబుల్ జాకీర్ పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మరోవైపు, తప్పిపోయిందనుకున్న కూతురు దొరికిందనుకున్న సంతోషంతో సంగారెడ్డికి పరుగుపరుగున వచ్చిన నౌసిన్ తల్లిదండ్రులు వచ్చీరాగానే కూతురు చనిపోయిందని తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు.

More Telugu News