అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనంతో పెట్రోల్ ధర మరోమారు తగ్గింది. పెట్రోల్ ధరతో పాటు డీజిల్ ధరను కూడా తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా తగ్గుదలలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 2.42, డీజిల్ ధర రూ. 2.25 తగ్గింది. ఆయిల్ కంపెనీలు తీసుకున్న ధరల తగ్గింపు నిర్ణయం నిన్న రాత్రి నుంచి అమలులోకి వచ్చింది. స్థానిక పన్నుల్లో తగ్గింపునూ కలుపుకుంటే ధరలు మరికొంత తగ్గుతాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.66.39 నుంచి రూ.63.92కు, డీజిల్ ధర రూ. 54.57 నుంచి రూ.52.13కు తగ్గింది. పెట్రోల్ ధర ఆగస్టు నుంచి వరుసగా తగ్గడం ఇది పదోసారి కాగా, డీజిల్ ధర అక్టోబర్ నుంచి వరుసగా తగ్గడం ఇది ఆరోసారి.
చమురు ధరలు తాజాగా తగ్గినా చమురు కంపెనీలకు ఇప్పటికీ లీటరు పెట్రోల్‌పై రూ. 4, లీటరు డీజిల్‌పై రూ. 3.6 లాభం వస్తోంది. ముడి చమురు కొనుగోలుకు, శుద్ధి చేసిన చమురు అమ్మకానికి మధ్య కాలంలో అంతర్జాతీయ విపణిలో ధరల తగ్గుదల వల్ల కంపెనీలకు వచ్చిన నిల్వల నష్టాన్ని పూడ్చుకోవడానికి ఈ లాభాలను వాడుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెట్రోల్ ధర మళ్లీ తగ్గినప్పటికీ అది విమాన ఇంధనం(ఏటీఎఫ్) కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు ఏటీఎఫ్ రూ. 46.51 పలుకుతోంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు