బుర్రిపాలెంను మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నారు: జయదేవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుర్రిపాలెంను మహేష్ బాబు దత్తత తీసుకుంటున్నారు: జయదేవ్

గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామాన్ని తన బావమరిది, సినీహీరో మహేష్‌బాబు త్వరలో దత్తత తీసుకోనున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. బుర్రిపాలెం జెడ్పీ హైస్కూలు ఆవరణలో సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు జయదేవ్ శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడుతూ, బుర్రిపాలెంను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని తాను, మహేష్ బాబు ఎన్నికలకు ముందే అనుకున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులు స్వగ్రామం, ఆత్తగారి ఊర్లను దత్తత తీసుకోకూడదన్న నిబంధనలు ఉండడంతో అది కార్యరూపం దాల్చలేదని, దీంతో తన భార్య, సూపర్‌ స్టార్ కృష్ణ కుమార్తె పద్మ తెనాలి మండలం కంచర్లపాలేన్ని, తన బావమరిది మహేష్ బాబు అతని స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకోనున్నారని ఆయన వెల్లడించారు.

More Telugu News