2జీ స్కాంలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా : మాజీ మంత్రి రాజా
2జీ స్పెక్ట్రమ్ స్కాంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని మాజీ టెలికం మంత్రి ఏ.రాజా అన్నారు. అయితే, 2జీ లైసెన్సుల వ్యవహారంలో ఆనాడు ప్రధానమంత్రిని సంప్రదించాకే కేటాయింపులు చేశానని తెలిపారు. ఈ స్కాంలో రాజాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి చిదంబరం ఏ విధంగానూ ప్రభావితం చేయలేదంటూ జాయింట్ పార్లమెంట్ కమిటీ నిన్న క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజా ఢిల్లీలో పైవిధంగా వ్యాఖ్యానించారు.
కాగా, ఈ అంశంలో జేపీసీ ఎదుట హాజరై సాక్ష్యం ఇచ్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్ సభ స్పీకరుకు, కమిటీ ఛైర్మన్ పీసీ చాకోకు గతంలో రాజా లేఖ కూడా రాశారు. మరోవైపు ఇదే అంశంపై డీఎంకే నేత కరుణానిధి చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక మంత్రి ప్రధానిని ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి విషయం నమ్మశక్యంగాలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.