వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! నెల్లూరు జిల్లా చుట్టి వాసులు ఇప్పటికీ గ్రామంలోకి ప్రవేశించే సమయంలో చెప్పులు కాళ్లకుండవు... వారి చేతుల్లో కనిపిస్తాయి. ఏదో నిమ్నవర్గాల వారు మాత్రమే దీనిని పాటిస్తున్నారనుకుంటే పొరబడ్డట్టే. గ్రామంలోని అన్ని కులాలు, మతాల వారు కూడా ఈ ఆచారాన్ని తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే, "చెప్పులతో ఊళ్లోకి ప్రవేశిస్తే... చెడు జరుగుతుందండి బాబూ" అని చుట్టి వాసులు సమాధానమిస్తారు.
ఏళ్ల తరబడి ఆ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతోందట. గ్రామంలోకి ప్రవేశించాలంటే, గ్రామ దేవత ఉన్న ఆలయాన్ని దాటుకుని వెళ్లాలి. గ్రామదేవత ఆలయం ముందు చెప్పులేసుకుని నడిస్తే, కీడు తప్పదని తమ పెద్దలు చెప్పారని గ్రామస్థులు చెబుతున్నారు. చిత్రంగా ఉంది కదూ? అయినా వారు పెట్టుకున్న ఆచారాన్ని వారే సంతోషంగా ఆచరిస్తుంటే, మనకు చిత్రమైతేనేం... విచిత్రమైతేనేం! వారు మాత్రం ఊరు సమీపంలోకి చేరుకోగానే ఎప్పటిలానే చెప్పులు చేతబట్టి ఊళ్లోకి అడుగుపెట్టడం కొనసాగుతూనే ఉంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు