ఒబామాపై సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామాపై సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు

భారత్ లో పర్యటన ముగించుకుని వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత మత సహనంపై ఆయన ఉపన్యాసం ఇవ్వరాదని అన్నారు. ఆయన పనేదో ఆయన చూసుకోవాలని హితవు పలికారు. "అమెరికాలో రెండు మిలియన్ల మంది భారతీయులున్నారు. అక్కడ వారు దేవాలయాలు నిర్మించుకునేందుకు అనుమతించరు, దీపావళి జరుపుకునేందుకు అనుమతించరు గానీ... ఇక్కడ మాత్రం ఒబామా ఉపన్యాసాలు ఇస్తారు. అమెరికాలో సామరస్యం సాధించామని చెబుతారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు హిందువులను పశువుల కన్నా హీనంగా చూస్తారు. భారత్ లో అయితే 800 ఏళ్లుగా ఇస్లామిక్ మైనారిటీ వర్గం మెజారిటీ హిందువులను వేధిస్తోంది" అని పేర్కొన్నారు. మంగళవారం నాడు ఒబామా ఢిల్లీలో చేసిన ప్రసంగంపై స్పందిస్తూ స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News