Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమానం ఎక్కించుకోలేదని కుక్క పిల్లను చంపేసింది!

తాను పెంచుకుంటున్న ఓ కుక్క పిల్లను విమానంలో తీసుకువెళ్లేందుకు అంగీకరించకపోవడంతో దాన్ని చంపేసి దర్జాగా ఫ్లయిట్ ఎక్కి వెళ్లిపోయిందో మహిళ. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. ఫ్లోరిడాకు చెందిన సింథియా వీ ఆండర్సన్ అనే 56 ఏళ్ల మహిళ తన రెండు వారాల డాబర్‌మాన్ కుక్క పిల్లను తీసుకొని నెబ్రాస్కా విమానాశ్రయానికి వెళ్లింది. కుక్క పిల్లను తన క్యారీ బ్యాగులో పెట్టుకొని విమానం ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, కుక్క పిల్లది మరీ చిన్న వయస్సు కావడంతో విమానంలో ప్రయాణించేందుకు అనుమతించలేదు. దీంతో, ఏం చేయాలో పాలుపోని ఆమె వాష్‌ రూమ్‌ కు వెళ్లి కుక్కపిల్లను టాయిలెట్ కమోడ్‌ లో పడేసి గబగబా వెళ్లి విమానం ఎక్కి వెళ్లిపోయింది. ఆమె వెనకాలే వాష్‌ రూమ్‌ లోకి వెళ్లిన మరో మహిళ ఈ ఉదంతాన్ని గమనించి ఫిర్యాదు చేయగా, అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

More Telugu News