రాజ్ భవన్ వద్ద కిడ్నాప్ కలకలం... బాలికల అపహరణకు వ్యక్తి విఫలయత్నం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్ భవన్ వద్ద కిడ్నాప్ కలకలం... బాలికల అపహరణకు వ్యక్తి విఫలయత్నం

హైదరాబాదులోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో కొద్దిపేపటి క్రితం కిడ్నాప్ కలకలం రేగింది. రాజ్ భవన్ సమీపంలోని మక్తాలో ఇద్దరు బాలికలను అపహరించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. అయితే, ఆ విషయాన్ని పసిగట్టిన స్థానికులు అతడిని పట్టుకున్నారు. పట్టపగలు బాలికలను అపహరించేందుకు యత్నించిన అతడికి దేహశుద్ధి చేసిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. రాజ్ భవన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు.

More Telugu News