Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రతిభగల క్రీడాకారులందరినీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది: కేటీఆర్

ప్రతిభగల క్రీడాకారులందరికీ ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో త్వరలో షూటింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని, అందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనీ అన్నారు. జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన షూటింగ్ అకాడమీని కేటీఆర్ ప్రారంభించారు. షూటర్, ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సినీ నటుడు నాగార్జున ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం నుంచి అద్భుతమైన షూటర్లున్నారని అన్నారు.

More Telugu News