Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంఎస్ ప్రేమించానని వస్తే నేనే పెళ్లి జరిపించా: పరుచూరి గోపాలకృష్ణ

ఎంఎస్ నారాయణలోని మరో కోణం తనకు తెలుసునని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. అందరికీ నటుడుగా, రచయితగా తెలుసనీ, తనకు మాత్రం ఆయన విద్యార్థి అని గుర్తుతెచ్చుకున్నారు. కళాప్రపూర్ణను ప్రేమించానని, కులాంతర వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని ఎంఎస్ తనవద్దకు వస్తే, పెళ్లికి పెద్దరికం వహించానని తెలిపారు. ఆ సమయంలో జీవనం గడిచేందుకు ఓ సినిమా థియేటర్ లో బుకింగ్ క్లర్క్ గా పనిచేశాడని చెప్పారు. నిన్న ఉంటాడనుకున్న వ్యక్తి నేడు లేకపోవడం బాధాకరమని పరుచూరి గోపాలకృష్ణ చెమర్చిన కళ్ళతో పేర్కొన్నారు.

More Telugu News