కేసీఆర్ ధోరణికి నిరసనగా నిరాహారదీక్ష చేపట్టనున్న ఆర్.కృష్ణయ్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ధోరణికి నిరసనగా నిరాహారదీక్ష చేపట్టనున్న ఆర్.కృష్ణయ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా నిరాహారదీక్ష చేపడుతున్నట్టు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పారు. విద్యార్థుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని... ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇప్పటిదాకా చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కృష్ణయ్య మండిపడ్డారు. రానున్న గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాదు, ఇందిరాపార్క్ వద్ద తన నిరాహారదీక్ష ప్రారంభమవుతుందని వెల్లడించారు.

More Telugu News