Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రారంభమైన ఏఐ విమాన సేవలు

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గన్నవరం నుంచి న్యూఢిల్లీకి కొత్త సర్వీసును నేటి ఉదయం ప్రారంభించింది. ఈ సర్వీసును ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. మరిన్ని విమాన సర్వీసులు తెచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఎంపీలు చెప్పారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ-విజయవాడ (వయా హైదరాబాద్) మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌ హాం, ఫ్రాంక్‌ ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌ తదితర విదేశీ గమ్యస్థానాలకు వెళ్ళే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు కొత్త సర్వీసు లాభిస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.

More Telugu News