జగన్ ది దొంగల పార్టీ: నారా లోకేష్
కృష్ణాజిల్లా గుడివాడలో పర్యటిస్తున్న నారా లోకేష్, ఇక్కడ ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిది దొంగల పార్టీ అంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రుణమాఫీ సాధ్యం కాదన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పుడు రుణమాఫీ చేయాలంటూ ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 50 రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలను నమోదు చేసి టీడీపీ రికార్డు నెలకొల్పిందని పేర్కొన్నారు.