ఆత్మాహుతి దళంలో చేరి... ఇస్లామిక్ స్టేట్ కు టోకరా ఇచ్చిన బాలుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆత్మాహుతి దళంలో చేరి... ఇస్లామిక్ స్టేట్ కు టోకరా ఇచ్చిన బాలుడు

ఉగ్రవాదుల బలవంతం మీద ఇస్లామిక్ స్టేట్ ఫైటర్ గా మారి, వారి విధానాలు నచ్చక ఎలాగైనా బయటకు రావాలన్న ఉద్దేశంతో ఆత్మాహుతి దళంలో చేరాడో 14 ఏళ్ల బాలుడు. ఉసైద్ బర్హో అనే పేరున్న ఈ బాలుడు ఒంటి నిండా బాంబులు పెట్టుకొని భద్రతా దళాల దగ్గరికి వచ్చి లొంగిపోయాడు. ఇతనివద్ద ఐఎస్ కు సంబంధించిన ఎంతో సమాచారం లభించింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ వేళ్ళూనుకోకపూర్వం ఉసైద్ నిత్యమూ ఫుట్ బాల్ ఆడేవాడు. జాకీ చాన్ సినిమాలు చూసేవాడు. డాక్టర్ కావాలని కలలు కనేవాడు. పరిస్థితి మారి ఉగ్రవాద ప్రాబల్యం పెరిగిన తరువాత, ఒక మసీదులో ఉన్న ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తమలో చేర్చుకున్నారు ఐఎస్ ఫైటర్ లు. షియాలపై యుద్ధం చేయకుంటే, వారు వచ్చి నీ తల్లిపై అత్యాచారం చేస్తారని బెదరించారు. దీంతో వారిలో చేరిన ఉసైద్ కు త్వరలోనే అక్కడి పరిస్థితి తెలిసింది. ఎలాగైనా తప్పించుకోవాలని భావించి అందుకు ప్రాణాంతక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆత్మాహుతి దళంలో చేరతానని ఉగ్ర పెద్దలకు చెప్పగా వారు వెంటనే అంగీకరించారు. బాలుడికి పేలుడు పదార్థాలు ఉన్న జాకెట్ తొడిగి బాగ్దాద్ లోని షియా మసీదు వద్దకు పంపారు. అక్కడికి చేరుకున్న ఉసైద్ భద్రతా దళాలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉసైద్ ను గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచారు.

More Telugu News