ద్విచక్ర వాహనంపై ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తున్న చందు, జ్యోతి దంపతులు హైదరాబాదు, బేగంపేట వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డారు. తమ రెండేళ్ల కుమారుడు సహా వీరికి గాయాలయ్యాయి. అందరిలా వీరు ఆసుపత్రికి పోకుండా ఘటనా స్థలిలోనే వినూత్న నిరసన చేపట్టారు. గుంతకు వాహనాన్ని అడ్డుగా పెట్టి, తక్షణం దాన్ని పూడ్చివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా వారిని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు.
యాక్సిడెంట్ అయిన తమను ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ దాడి చేశాడని జ్యోతి పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి వాపోయారు. చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతుండగా, తాము పబ్ కో, మరెక్కడికో వెళ్లలేదని, ఉయ్యాల ఫంక్షన్ కు వెళ్లి వస్తున్నామని జ్యోతి చెబుతుండటం గమనార్హం. మహిళను రాత్రిపూట స్టేషన్ లో ఉంచకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, జ్యోతిని నిర్బంధించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం తాము వెళ్ళమని చెప్పినా ఆమె ఇంటికి పోలేదని అంటున్నారు.
More Telugu News
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?
-
ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత
-
మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అదరగొట్టాడు.. అతనికి ఆ ఫార్మాట్లో కూడా అవకాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్
-
సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్లైన్లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు
-
సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ
-
యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!
-
టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన
-
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం
-
ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయణ' మెలోడీ
-
ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి