Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీవీకి కూడా భారతరత్న ఇవ్వాల్సిందే: కేసీఆర్

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని దివంగత పీ.వీ.నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని గతంలోనే ఇచ్చి ఉండాల్సిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఆయనకు భారతరత్న ఇవ్వకపోవటం వెలితిగా ఉందని ఆయన అన్నారు. పీవీకి భారతరత్న ఇచ్చేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయనకు కూడా భారతరత్న ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో పీ.వీ.నరసింహరావుకు భారతరత్న ఇవ్వాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.

More Telugu News