Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"అత్యాచారం చేయను" అన్న బ్రెజిల్ ప్రజాప్రతినిధిపై నిరసనల వెల్లువ

జీర్ బోల్సోనారో... బ్రెజిల్ పార్లమెంట్ లో విపక్ష సభ్యుడు. ఒక చర్చలో భాగంగా మహిళా సభ్యురాలిని ఉద్దేశించి "నీపై నేను అత్యాచారం చేయను. ఎందుకంటే, నీకంత విలువ లేదు" అన్నాడు. బోల్సోనారో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ మానవ హక్కులపై చర్చ జరుగుతున్న సమయంలో మారియా డో రోసారియోను ఉద్దేశించి "ఇక్కడే ఉండు మారియా... నేను నిన్ను మానభంగం చేయను" అన్నాడు. బోల్సోనారో వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బోల్సోనారోపై మారియా కేసు పెట్టగా, తన మాటలకు కట్టుబడి ఉంటానని బోల్సోనారో చెబుతున్నారు. కాగా, సంప్రదాయ పురుషాధిక్య సమాజం ఉన్న బ్రెజిల్ లో రోజుకు సగటున 137 లైంగిక వేధింపుల కేసులు నమోదవుతుంటాయి.

More Telugu News