పైసా ఖర్చులేకుండా ప్రపంచం చుట్టేశారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పైసా ఖర్చులేకుండా ప్రపంచం చుట్టేశారు!

అవకాశం వస్తే పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని చుట్టిరావాలని ఎవరికి మాత్రం ఉండదు? అయితే, మిలన్, ఎలిమజ్ అనే మిత్రులు మాత్రం అలా అనుకోలేదు. అవకాశం సృష్టించుకుని పైసా ఖర్చులేకుండా ప్రపంచాన్ని చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు. నాలుగేళ్ల క్రితం డిసెంబర్ లో ఈ ఇద్దరు బెర్లిన్‌ లో కలుసుకున్నారు. తొలి పరిచయమే గాఢ స్నేహంగా మారడంతో ‘‘ఇద్దరం కలిసి ప్రపంచమంతా పర్యటిద్దాం’’ అని అనుకున్నారు. మిలన్, ఎలిమజ్‌ లు సంపన్నులు కాకపోవడంతో ట్రావెల్ కంపెనీలను సహకరించమని కోరారు. దీంతో, కొంత మొత్తం వారికి సహాయం చేసేందుకు ట్రావెల్ కంపెనీలు ఒప్పుకున్నాయి. అలా ఒక దేశానికి వెళ్లడం, ఆ దేశంలోని దాతల నుంచి సహాయం పొందడం, అక్కడి నుంచి ఇంకో దేశం... ఇలా ఆస్ట్రియా, హంగేరీ, రొమేనియా, బల్గేరియా, టర్కీ, ఇరాన్, పాకిస్థాన్, ఇండియా, అమెరికా, సింగపూర్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి, ఆయా సంస్కృతులను దగ్గరగా గమనించే అదృష్టానికి నోచుకున్నారు. అన్ని దేశాలు తిరిగిన ఈ ఇద్దరు మిత్రులు తమ పర్యటనల అనుభవాలను ‘ది అప్టిమిస్టిక్ ట్రావెలర్’ పేరిట ఫేస్‌ బుక్‌ లో షేర్ చేసుకుంటున్నారు.

More Telugu News