Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నైతిక విలువలంటే గౌరవం: రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని

నైతిక విలువలు, ప్రజాస్వామ్యంపై తనకు అపార గౌరవముందని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన తాను ఎవరో చెబితే నేర్చుకునే స్థితిలో లేనని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. శాసనసభ్వత్వానికి రాజీనామా చేస్తూ లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపానన్నారు. ఇక, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయన్న ఆయన, మున్ముందు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. సనత్ నగర్ ప్రజల ఆప్యాయతను మరిచిపోలేనని వ్యాఖ్యానించిన తలసాని ఇకపై జంట నగరాల అభివృద్ధికి పాటుపడతానని వెల్లడించారు. తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు ఇకనైనా తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

More Telugu News