Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నాలుగో దశ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే, పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి జమ్మూ కాశ్మీర్లో 24 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఝార్ఖండ్ లో 59.90 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో ఝార్ఖండ్ లో 15 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా, జమ్మూ కాశ్మీర్లో 18 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది.

More Telugu News