చైనా యాపిల్ గా పేరుగాంచిన స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం జియోమీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఇకపై భారత్ లో విక్రయాలు జరపరాదని, భారత్ కు తన స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేయరాదని ఆదేశిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. మొబైల్ తయారీలో మునుపటి తరం దిగ్గజం ఎరిక్ సన్ వేసిన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఎఫ్ఆర్ఏఎన్డీ నిబంధనల మేరకు భారత్ లో మొబైల్ ఫోన్లను విక్రయించాలనుకునే విదేశీ సంస్థ, ఎరిక్ సన్ కు నిర్ణీత మేర రుసుమును చెల్లించాల్సి ఉంది. అయితే జియోమీ ఈ నిబంధనను అతిక్రమించి, తనకు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే భారత్ లో విక్రయాలు కొనసాగిస్తోందని ఎరిక్ సన్ తన పిటిషన్ లో పేర్కొంది. అంతేకాక తాను పంపిన నోటీసులకు జియోమీ స్పందించలేదని కూడా ఎరిక్ సన్ వాపోయింది. ఎరిక్ సన్ వాదన విన్న ఢిల్లీ హైకోర్టు భారత్ లో విక్రయాలు నిలిపేయాల్సిందిగా జియోమీని ఆదేశించింది. భారత్ లో భారీ క్రేజ్ ఉన్న జియోమీ ఫోన్లు క్షణాల వ్యవధిలో విక్రయమైపోతున్న సంగతి తెలిసిందే.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి