పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ మరోసారి తెరపైకి వచ్చారు. కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో వివరించారు. 'కుక్క కాటుకు చెప్పు' దెబ్బ తరహాలోనే కార్గిల్ పోరాటం చోటు చేసుకుందని అన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించిందని, అందుకు ప్రతీకారంగానే కార్గిల్ వార్ జరిగిందని వెల్లడించారు. కరాచీలో ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఆవిర్భావంలో పాత్ర పోషించడమే కాకుండా, సియాచిన్ పై పట్టుకు పాకులాడుతోందని అన్నారు. ఇలాంటివి అనేక చర్యలే కార్గిల్ పోరుకు దారి తీశాయని పేర్కొన్నారు. భారత్ తో ప్రతి అంశంలోనూ 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ' తరహాలోనే వ్యవహరించాలని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. అన్నట్టు, 1999లో కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో పాక్ ఆర్మీకి చీఫ్ గా వ్యవహరించింది ముషారఫ్ మహాశయుడే.
ఇక, భారత్ తో సంబంధాలపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. చర్చల అంశంలో భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే, పాకిస్థాన్ రెండడుగులు ముందుకేస్తుందని అన్నారు. భారత్ తో పాక్ చెలిమి సమాన హక్కుల ప్రాతిపదికనే సాధ్యమవుతుందని సెలవిచ్చాడీ మాజీ అధ్యక్షుడు. "ప్రజలు నేను భారత్ తో మైత్రికి వ్యతిరేకమని భావిస్తారు. కానీ, అది తప్పు. నా హయాంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. కాశ్మీర్, సర్ క్రీక్, నీటి ఒడంబడిక వంటి అంశాలు పరిష్కారం ముంగిట నిలిచాయి" అని పేర్కొన్నారు. భారత్ ను నరేంద్ర మోదీ సర్కారు పాలిస్తున్నా రెండు దేశాల మధ్య చెలిమి సాధ్యమేనని అన్నారు. కానీ, భారత్ దూకుడు ప్రదర్శిస్తే, తాము కూడా అదే రీతిలో స్పందిస్తామని కటువుగా వ్యాఖ్యానించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు