ఉగ్రవాదుల నుంచి నిజాలు చెప్పించడం కోసం అమెరికా సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ) అధికారులు అత్యంత క్రూరమైన, నీచమైన, ప్రాణంతకమైన పద్ధతులను వాడారట. అధ్యక్షుడు సహా వైట్ హౌస్ వర్గాలకుగాని, ప్రజా ప్రతినిధులకుగాని ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా ఉగ్ర అనుమానితులను తీవ్రంగా హింసించారని సెనేట్ కమిటీ ఓ నివేదికను విడుదల చేసింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై దాడుల అనంతరం అధ్యక్షుడు బుష్ కు సైతం తెలియకుండా ఎంతో మందిని హింసించారని, అందుకు హేయమైన పద్దతులు వాడారని సెనేట్ తెలిపింది.
అబూ జుబైదా, ఖలీద్ షేక్ మహమ్మద్ అనే ఉగ్ర ఖైదీలపై 'వాటర్ బోర్డింగ్' పద్ధతిని వాడారని వివరించింది. మొత్తం 119 మందిని ఇంటరాగేట్ చేసిందని, వారిలో 29 మంది వరకు నిరపరాధులని తెలిపింది. 'వాటర్ బోర్డింగ్' హింసా పద్ధతిని వివరిస్తూ, నిందితుడిని వారం, పది రోజుల పాటు మత్తు ద్వారా నిద్రలో ఉంచి ఆపై హింసను మొదలు పెడతారని, పైకి కనిపించని ఈ విధానంలో తాను నీటిలో మునిగిపోతున్న అనుభూతిని పొందే నిందితుడు ఒక్కోసారి అకస్మాత్తుగా మరణించే ప్రమాదముందని పేర్కొంది. కాళ్ళు, చేతులు కదలకుండా చేసి, ముఖంపై ఓ పలుచటి గుడ్డను ఉంచి ముక్కు రంద్రాల గుండా నీటిని పోసే ఈ విధానంలో మెదడు, ఊపిరితిత్తులలోకి నీరు చేరుతుందని, ఈ రకం హింస అత్యంత క్రూరమైనదని అభిప్రాయపడింది.
మరికొన్ని సార్లు అనుమానితుల మల ద్వారం గుండా నీటిని పంపి హింసించారని 6 వేల పేజీల సెనేట్ నివేదిక తెలిపింది. సీఐఏ ఇంటరాగేషన్ తరువాత నిందితులు ఓ చిన్న బోనులో ఉంచిన కుక్కల్లాగా కనిపించేవారని, ఏం చెబితే అది చేసే పరిస్థితికి వచ్చారని వివరించింది. సీఐఏ క్రూరత్వంపై ప్రస్తుతం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు