ఆసరా పింఛన్లలో భాగంగా తెలంగాణలో నేటి నుంచి రెండో విడత పంపిణీ ప్రారంభం కానుంది. గత నెలలో ఆసరా పింఛన్ల పంపిణీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే పలు జిల్లాల పరిధిలో తలెత్తిన సాఫ్ట్ వేర్ లోపాల కారణంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది. అర్హత ఉన్నా, తమకు పింఛన్ అందలేదని బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగారు. వీరికి ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
తాజాగా సాఫ్ట్ వేర్ లోపాలను సవరించిన అధికారులు రెండో విడత ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) భారీ ఏర్పాట్లు చేసింది. పింఛన్ కు అర్హత సాధించిన వారికి ఈ విడతలో డిసెంబర్ నెలతో పాటు నవంబర్ నెల పింఛన్ కూడా అందనుంది. ఇందుకోసం దాదాపు రూ.613.5 కోట్లు అవసరం కానుండగా, ఇప్పటికే రూ.453 కోట్ల నిధులను ఆయా జిల్లాలకు చేరవేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన నిధులు కూడా రెండు, మూడు రోజుల్లోగా జిల్లాలకు చేరనున్నాయని ప్రకటించింది. ఆసరా పింఛన్ల కోసం మొత్తం 39 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 25 లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి