నెల క్రితం జన్మించిన తమ పాప స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన ఆ దంపతులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పాప అంత్యక్రియల కోసం ఏర్పాట్లూ చేశారు. అయితే అటుగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి చిన్న పిల్లల వైద్యుడు రహీం ఆ దంపతుల్లో తిరిగి ఆనందం నింపారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది.
మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్ కు చెందిన సాత్విక, రాజు దంపతులకు నలభై రోజుల క్రితం ఓ ఆడ శిశువు జన్మించింది. అయితే నాలుగు రోజుల క్రితం పాలు తాగడం మానేసిన పసిపాప అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాప చనిపోయిందని భావించిన ఆ దంపతులు ఈ నెల 6న పాప అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో గ్రామానికి వచ్చిన వైద్యుడు రహీం పాపను పరిశీలించి, పాప చనిపోలేదని నిర్ధారించాడు. వెంటనే సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలోని శిశు సంజీవని విభాగంలో చేర్పించి రిస్కీ ట్రీట్ మెంట్ ద్వారా పాపను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రికి పాపను తరలించారు. చనిపోయిందనుకున్న తమ పాప తిరిగి స్పృహలోకి రావడంతో ఆ దంపతులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!