తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో కర్నూలు జిల్లా ఆదోని కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. 2008లో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు బృందంపై బాంబులతో దాడి చేసిన ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి మరీ హత్య చేశారు. నాడు వెంకటప్పనాయుడు సొంత గ్రామం కప్పట్రాళ్ల సహా ఆదోని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు.
ఈ కేసులో తుది తీర్పు నేపథ్యంలో కప్పట్రాళ్లతో పాటు ఆదోనిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేసిన పోలీసులు ఆదోనిలో భారీ ఎత్తున బలగాలను రంగంలోకి దించారు. ఇదిలా ఉంటే, గ్రామంలో పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చే క్రమంలో జిల్లా ఎస్పీ రవికృష్ణ శనివారం రాత్రి కప్పట్రాళ్లలో బస చేశారు. కోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు