అమెరికా ప్రపంచ దేశాలపై గూఢచర్యం చేస్తోందంటూ ఆ దేశం సేకరిస్తున్న రహస్య సమాచారం గుట్టువిప్పి గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెర్న్ రష్యా చేరడం వెనుక పెద్ద కథే నడిచిందని రష్యా మాజీ సీక్రెట్ ఏజెంట్ తెలిపారు. స్నోడెర్న్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ఓ మహిళా గూఢచారిని ప్రయోగించిందని రష్యా గూఢచారి సంస్థ కేజీబీ మాజీ ఏజెంట్ బొరిస్ కార్పిచ్ కోవ్ తెలిపారు.
తమ బద్ధశత్రువు అమెరికాను వణించిన స్నోడెర్న్ ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నా చాప్ మాన్ (32) అనే 'వేగు' చుక్కను రష్యా రంగంలోకి దించిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చాప్ మాన్ తన సోయగాలతో స్నోడెర్న్ కు వలవేసిందని ఆయన పేర్కొన్నారు.
స్నోడెర్న్ ను ఒకేసారి కలిసినప్పటికీ 'స్నోడెర్న్... నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్విట్టర్ లో చాప్ మాన్ కోరిందని ఆయన తెలిపారు. ఈ కథంతా పథకం ప్రకారం జరిగిందని, స్నోడెర్న్ అందుకు అంగీకరించి ఉంటే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు స్నోడెర్న్ అర్హుడవుతాడని ఆయన వెల్లడించారు. అలా జరిగి ఉంటే స్నోడెర్న్ శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావచ్చని ఆయన అన్నారు.
ఆ తరువాత ఆయన విదేశాలకు వెళ్లాలనుకుంటే రష్యా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వుండేదని ఆయన వివరించారు. ఆ తరువాత స్నోడెర్న్ కు చేసిన పెళ్లి ప్రతిపాదనపై మాట్లాడేందుకు చాప్ మాన్ నిరాకరించింది. కాగా చాప్ మాన్ రష్యా దౌత్యవేత్త పుత్రిక. రష్యా ఏజెంటుగా ఆమె బయటి ప్రపంచానికి తెలియక ముందు ఆమె న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేసింది. అమెరికా నుంచి రష్యా చేరుకున్న అనంతరం చాప్ మాన్ మోడల్ గా పని చేసింది. అనంతర పరిణామాల్లో స్నోడెర్న్ అమెరికా నుంచి రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!