భవిష్యత్ లో కూడా ఇటువంటి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నేడు జరిగిన అఖిలపక్షం సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. పేదలు ఉంటున్న 125 గజాల స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ జలాల శుద్ధికి అఖిలపక్షం అండగా ఉంటుందని హామీ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించాలని పార్టీలు సూచించాయని ఆయన పేర్కొన్నారు.