నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ కలిగి ఉన్న బౌలర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, సయీద్ అజ్మల్, మహ్మద్ హఫీజ్ తదితర స్పిన్నర్లను సస్పెండ్ చేసిన ఐసీసీ తాజాగా మరికొందరిపైనా కన్నేసినట్టు తెలుస్తోంది. ఐసీసీ తాజా జాబితాలో సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా కూడా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఐసీసీ టెక్నికల్ కమిటీ బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ ను అప్రమత్తం చేసిందట.
భజ్జీ 2011 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండగా, గతేడాది వెస్టిండీస్ తో టెస్టు సిరీసే ఓజాకు చివరిది. హర్భజన్ బౌలింగ్ పై ఆరోపణలు ఇప్పటివి కావు. భజ్జీ బౌలింగ్ శైలిని ఆసీస్ అంపైర్ డారెల్ హెయిర్ ఎన్నోమార్లు తప్పుబట్టారు. ఇదిలా ఉంటే, ఐసీసీ కన్నేసిన కారణంగానే బీసీసీఐ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక సందర్భంగా వీరిద్దరినీ పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. కాగా, సస్పెన్షన్ వేటుకు గురై, యాక్షన్ సరిదిద్దుకున్న శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో ఆడేందుకు ఐసీసీ మంగళవారం అనుమతించింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు