టెక్నాలజీకి వైరస్ లు సవాళ్లు విసురుతున్నాయి. తాజాగా, ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు సరికొత్త ట్రోజన్ వైరస్ ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ దాడికి గురైన ఫోన్ల నుంచి యూజర్ల ప్రమేయం లేకుండానే ఎస్సెమ్మెస్ లు వెళతాయని తెలిపారు. పాస్ వర్డ్ లు, విలువైన సమాచారాన్ని ఈ వైరస్ తస్కరిస్తుందని వివరించారు. ఈ వైరస్ కు 'ఆండ్రాయిడ్ ఎస్సెమ్మెస్ సెండ్' గా నామకరణం చేశారు. ఆండ్రాయిడ్ యాప్ ల మాటున ఇది ఫోన్లలోకి చొరబడుతుందట.
ఒక్కసారి ఇది ప్రవేశించిన తర్వాత మొబైల్ ఫోన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని, కాంటాక్ట్ లిస్టులోని నెంబర్లకు మనకు తెలియకుండానే మెసేజ్ లు వెళతాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) పేర్కొంది. ఈ మేరకు దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు సూచనలు చేసింది. విశ్వసనీయం కాని సోర్స్ నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేసుకోరాదని, ఇన్ స్టాల్ చేసుకునే ముందు అన్ని అంశాలు పరిశీలించుకోవాలని తెలిపింది. డివైస్ ఎన్ క్రిప్షన్ ఉపయోగించాలని సూచించింది. గుర్తు తెలియని వై-ఫై నెట్ వర్క్ లకు దూరంగా ఉండాలని పేర్కొంది.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి