బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. మొత్తం 89.2 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు వచ్చీ రాగానే దూకుడు ప్రదర్శించింది. అయితే ఆదిలోనే తొలి వికెట్ ను పడగొట్టిన ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకు షాకిచ్చాడు. ఆ తర్వాత భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ లో పదో శతకాన్ని నమోదు చేశాడు. 145 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్ పెవిలియన్ చేరాడు. మైఖేల్ క్లార్క్ (60), స్టీవ్ స్మిత్ (72)లు రాణించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించగలిగింది.
వార్నర్ క్రీజులో ఉన్నంతవరకు ఆసీస్ వికెట్లను కూల్చడంతో ఇబ్బందిపడ్డ టీమిండియా బౌలర్లు అతడు వెనుదిరిగిన తర్వాత స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను పడగొట్టారు. భారత బౌలర్లలో మొహ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ, కరణ్ శర్మలు చెరో వికెట్ తీసుకున్నారు. తొలి రోజు ఆటలో సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు