అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి రుణమాఫీ ప్రారంభం అవుతుందని... 11 నుంచి 16వ తేదీ వరకు రైతు సాధికారిక సదస్సులు నిర్వహించనున్నామని వెల్లడించారు. సచివాలయం నుంచి మంత్రులు, జిల్లా స్థాయి అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు నెలల పాలనపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పకపోయినా పండ్లతోటలు ఉన్నవారికి ఎకరాకు రూ. 10 వేలు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి రెండు బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. బ్యాంకుల ద్వారానే ప్రభుత్వ లబ్ధి అందేలా చూడాలని చెప్పారు. స్వయంసహాయక బృందాల నైపుణ్యాలను పెంచేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
అర్హులకు పింఛన్లు సక్రమంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తామని... భూసార పరీక్షల నుంచి మార్కెటింగ్ వరకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను బడికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. రైతు సాధికారిక సదస్సులో ఖరీఫ్ సాగుపై గ్రామాల వారీగా సమీక్ష నిర్వహించాలని సూచించారు.
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి, ప్రతి వీధిలో పబ్లిక్ టాయ్ లెట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ నేతలు, ఐఏఎస్ అధికారులు, ఎన్నారైలు, సీనీరంగ ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రెండో విడత రైతు రుణమాఫీ జాబితా సిద్ధమవుతోందని వెల్లడించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు