మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన కాంగ్రెస్ నేతలను వైరాగ్యం ఆవరించినట్లుంది. లేకపోతే, అధికారంలోకి రాకపోవడం మాకు కొత్తేమీ కాదుగా? అంటూ వారు ఎందుకు వ్యాఖ్యానిస్తారు చెప్పండి. అదీ సాక్షాత్తు ఆ పార్టీ తెలంగాణ చీఫ్ పొన్నాల నోటి నుంచి ఈ తరహా ప్రకటన వస్తే ఇంకేమన్నా ఉందా? వైరాగ్యమో, ఓటమిని అంగీకరించడమో... ఏదైతేనేం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నేడు ఇదే వ్యాఖ్య చేశారు. అది కూడా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
గడచిన ఎన్నికల్లో తమతో పాటు ఆయా పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీల చిట్టాను వల్లించిన వైనాన్ని వివరిస్తున్న సందర్భంగా, సాధ్యమయ్యే హామీలను ఇచ్చిన తమను ప్రజలు ఓడించారన్నారు. అదే సమయంలో అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చిన వారిని ప్రజలు గెలిపించారన్నారు. అదే క్రమంలో ప్రసంగిస్తూ పోయిన ఆయన ‘‘అధికారంలోకి రాకపోవడం (పరాజయం పాలు కావడం) తమకు కొత్తేమీ కాదు’’ అని వ్యాఖ్యానించారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి