తొలితరం తెలుగు పత్రికల్లో ఒకటైన కృష్ణా పత్రిక సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వర్లు నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన సంఘసంస్కర్తగా, పాత్రికేయుడిగా విశేష సేవలందించారు. ఆయన భార్య సూర్యకుమారి, ఏకైక కుమారుడు కృష్ణ కిశోర్ కూడా కృష్ణా పత్రికలో పనిచేస్తున్నారు.
1902లో ముట్నూరు కృష్ణారావు ప్రారంభించిన కృష్ణా పత్రిక, తదనంతర కాలంలో మూతబడగా, 1983లో పత్రికను పిరాట్ల పునరుద్ధరించారు. పత్రికకు సంపాదకుడిగా ఉంటూ పూర్వవైభవానికి తనవంతు కృషి చేశారు. అంతకుముందు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా పనిచేసిన వెంకటేశ్వర్లు అనంతరం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన రచించిన ‘రెడ్ టెర్రరిజం ఇన్ ఇండియా’ పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది.
ఇందిరాగాంధీ సద్భావనా అవార్డుతో పాటు మరెన్నో అవార్డులను ఆయన అందుకున్నారు. ఎర్రగడ్డ శ్మశానవాటికలో నేటి మధ్యాహ్నం పిరాట్ల అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, పిరాట్ల మృతి విషయం తెలుసుకున్న పలువురు జర్నలిస్ట్ లు నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ సంతాపాన్ని తెలిపారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు