పెను ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. 2013లో మధ్యప్రదేశ్ జైలు నుంచి పారిపోయిన ఐదుగురు సిమి ఉగ్రవాదులు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు మనదేశంలో భారీ దాడులకు కుట్ర పన్నుతున్నట్లు ఐబీ స్పష్టం చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలకు హై ఎలర్ట్ పంపింది. మహ్మద్ ఐజాజుద్దీన్, మహ్మద్ అస్లాం, అమ్జాద్ ఖాన్, జాకిర్ హుస్సేన్ సాదిక్, మహబూబ్ గుడ్డులకు ఉగ్రదాడులు చేసే బాధ్యతను ఐఎస్ఐ అప్పగించినట్లు ఐబీ వర్గాలు వెల్లడించాయి.
వీరు ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని, వారు ఈ రాష్ట్రాల్లో దాగి ఉండే అవకాశం ఉందని ఐబీ అనుమానిస్తోంది. ఐఎస్ఐ హ్యాండ్లర్లు పంపిన ఓ సందేశాన్ని భారత నిఘా వర్గాలు అడ్డుకున్నాయి. అందులో ''వాళ్లకు మంచి ప్రాజెక్టు ఇచ్చాం. కొన్ని రోజులు వేచి చూడు'' అని ఉంది. చిట్టచివరి సారిగా ఈ ఐదుగురు కర్ణాటకలో ఉన్నట్లు తెలిసింది.
వీళ్ల గ్యాంగ్ లీడర్ ఫైజల్ తో కలిసి ఈ ఐదుగురు 2013 అక్టోబర్ 1వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జైలు నుంచి 14 అడుగుల ఎత్తున్న గోడ దూకి పారిపోయారు. వీళ్లు కొంతకాలం తెలంగాణ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నట్లు తెలిసింది. కరీంనగర్ లో ఫిబ్రవరి 1న జరిగిన బ్యాంకు దోపిడీలో కూడా వీళ్ల పాత్ర ఉందని అనుమానం వ్యక్తమైంది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు