టాలీవుడ్ దర్శక దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును బొగ్గు స్కాం వెంటాడుతోంది. తాజాగా, ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. యూపీఏ-1 హయాంలో దాసరి బొగ్గు శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించిన కాలంలోనే ఈ క్షేత్రాల కేటాయింపులు జరిగాయి. దీంతో, ఆయన కూడా ఈడీ వేడిని భరించాల్సి వస్తోంది! అప్పట్లో దాసరి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన సీబీఐ, ఆయన నివాసంలో సోదాలు కూడా నిర్వహించింది.
కాగా, ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు పరంగా బాగా వెనకబడిందని సుప్రీం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5లోగా కేసుకు సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించింది. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు మంత్రిత్వ శాఖను ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యవేక్షించారు. దాసరి ఆ సమయంలో సహాయమంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రైవేటు సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా బొగ్గు క్షేత్రాలు కేటాయించారని కాగ్ ఎత్తిచూపింది. ఎన్నో కంపెనీలు కారుచౌకగా ఈ బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్నాయని కాగ్ తెలిపింది. ఆ సమయంలో బొగ్గు క్షేత్రాల్లో 90 శాతం నిల్వలు ఉండగా, మార్కెట్ విలువ ప్రకారం సర్కారుకు రూ.86 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ వివరించింది. దీంతో, విపక్షాలు దుమ్మెత్తిపోయడంతో మన్మోహన్ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు